తెలంగాణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కి మేము అండగా ఉంటాం : సీఎం రేవంత్ రెడ్డి

-

కాకా వర్ధంతి సందర్భంగా వారికివే నివాళులు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గడ్డం వివేక్, వినోద్ లను చూసినప్పుడు నాకు రామాయణంలో లవకుశలు గుర్తొస్తారు అన్నారు. ఎంత సంపాదించామనేది కాదు, సమాజానికి ఎంత పంచామనేది. సామాజిక బాధ్యత అనేది కాకా విధానం గత 50 ఏళ్లుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దున ఘనత కాకా సొంతం అని ఆయన చెప్పుకొచ్చారు. దేశ నిర్మాణంలో ఆయన వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.


నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తే ఖచ్చితంగా గమ్యాన్ని చేరొచ్చు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కటోర దీక్షతో తెలంగాణాను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. డబ్బులు ఉంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి అని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. దేశంలో గాంధీ కుటుంబంలా రాష్ట్రంలో కాకా కుటుంబం కాంగ్రెస్ కు అండగా ఉంటుంది. రాష్ట్రంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు మేం అండగా ఉంటాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news