సీఎం జగన్ గుంటూరు పర్యటనలో ఫ్లెక్సీ కలకలం రేపింది. తమ గ్రామంలో పోరంబోకు భూమిని కాపాడు జగనన్న అంటూ ఫ్లెక్సి ఏర్పాటు చేశారు కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు. నల్లపాడు లో వైసిపి నేతలు భూ దోపిడి చేసారంటూ ఫ్లెక్సి ఏర్పాటు చేశారు.

సర్వే నెంబర్ 543, 546, 550 లలో వాగు పోరంబోకు భూమిని కబ్జా చేసిన వైసిపి నేతలు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసిపి నేత చల్లా అచ్చిరెడ్డి పేరుతో ప్లెక్సి ఏర్పాటు చేశారు. మరి దీనిపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
కాగా ఇవాళ సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటనకు బయలు దేరనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరారు సీఎం జగన్. ఇవాళ ఉదయం పదిన్నరకు నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ కు చేరుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి…ఈ సందర్భంగా శాప్ జెండా, జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు.
