సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయి – బండి సంజయ్

-

సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. మంగళవారం రోజు బిజెపి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ పుణ్యక్షేత్రాల్లోకి భక్తులు రాకుండా కుట్ర జరుగుతుందని అన్నారు. శబరిమలలో అనేకమంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారని.. చలికి ఇబ్బందులు పడుతూ అయ్యప్పలు నరకం అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్లాన్ ప్రకారమే స్వాములకు ఇబ్బందికర వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేయడమే కేరళ ప్రభుత్వ ఉద్దేశమని కీలక వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప భక్తుల ఇబ్బందులు పాలకులకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. హిందూ క్షేత్రాలను ఎందుకు వివాదం చేస్తున్నారని అన్నారు. తిరుపతిలో పులులు వస్తే కర్రలు ఇచ్చి భయానక వాతావరణ సృష్టించారని ధ్వజమెత్తారు. తబ్లిగీ జమాత్ ను ఇస్లామిక్ దేశాలు నిషేధించాయని.. ఆ సంస్థని రాష్ట్రానికి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. కోవిడ్ ని రాష్ట్రానికి తెచ్చిందే ఆ సంస్థ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news