వైసీపీలో గెలవలేని వ్యక్తి టీడీపీలో ఎలా గెలుస్తాడు..? – మంత్రి పెద్దిరెడ్డి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటించారు. శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి వేడుకలలో పాల్గొన్న అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. తాము టికెట్లు ఇవ్వని వాళ్లను లాక్కొని టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే వైసీపీలో గెలవలేని వ్యక్తి టిడిపిలో ఎలా గెలుస్తాడో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. గెలవలేని చోట అభ్యర్థులను మార్చుతామని స్పష్టం చేశారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికలలో వైసిపి మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ ని తాము వదిలేశాకే బాబు పట్టుకున్నారని.. బాబు తప్పుడు ప్రచారానికి ఎల్లో మీడియా అండగా ఉంటుందన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు పెద్దిరెడ్డి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేసింది ఏం లేదన్నారు. తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పనిచేసిన ముఖ్యమంత్రిని చూడలేదని సీఎం జగన్ ని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news