నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ఏపి నుంచి సుమారు 30 మంది కాంగ్రెస్ నేతలు హాజరవుతున్నారు. ఏపిసిసి అధ్యక్షుడు గిడిగు రుద్రరాజు, ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, సిడబ్ల్యుసి సభ్యుడు రఘువీరా రెడ్డి, డా.కేవిపి, డా.చింతా మోహన్, కొప్పుల రాజు, జేడి శీలం తదితర సీనియర్ నాయకులు సమావేశానికి హాజరౌతున్నారు.
రాహుల్ గాంధీ సమక్షంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం పై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపిలో పొత్తుల పై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపిలో కాంగ్రెస్ పార్టీ ని పునరుత్తేజం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకోనుంది అధిష్ఠానం. కాంగ్రెస్ పార్టీ లో వై.ఎస్.షర్మిల చేరితే, “స్టార్ కాంపైనర్” గా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ విజయం తర్వాత ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ దృష్టి పడింది. అందుకే షర్మిలకు కీలక బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.