‘వ్యూహం’ సర్టిఫికెట్ రద్దు కాలేదు : RGV

-

‘వ్యూహం’ సినిమా విడుదలను ఆపాలని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పడంపై డైరెక్టర్ ఆర్జీవి స్పందించారు. ‘కొన్ని ఛానెళ్లు చెప్తున్నట్లు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు అవ్వలేదు. నిజం ఏంటంటే కోర్టు CBFC నుంచి సర్టిఫికెట్ ఇవ్వడానికి సంబంధించిన రికార్డులు జనవరి 12 నాటికి సబ్మిట్ చేయాలని అడిగింది’ అని క్రియేట్ చేశారు. కాగా ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రను అభ్యంతరకరంగా చూపించారని లోకేష్ ఈ పిటిషన్ వేశారు.

ఇది ఇలా ఉండగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి 11వ తేదీ వరకు సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్లకు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్పై విచారణను జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news