టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడానిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి పలు సినిమాలను నిర్మించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు.
ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాలను నిర్మిస్తూ ఏ సినిమా అయినా సరే ఆయన హ్యాండ్ పడితే సూపర్ హిట్ అన్న ఘనతను కూడా దక్కించుకున్నారు. ముఖ్యంగా ఆయన నిర్మాణ సారధ్యంలో వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే దిల్ రాజు నిజామాబాదు ఎంపీ గాకాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు దిల్ రాజు తో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరిపిందని సమాచారం.