ఎన్నికల కోడ్ వస్తే 6 గ్యారెంటీ ల పరిస్థితి ఏంటి? : హరీష్ రావు

-

పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు.ఆరు గ్యారెంటీ లు వంద రోజుల్లో అమలు చేస్తాం అన్నారు. మార్చి 17 నాటికి 100 రోజులు పూర్తి అవుతుంది. తొందర ఎందుకు అని కాంగ్రెస్ అంటున్నది. జిల్లాలో పర్యటన లకు నాకు అనుభవాలు ఎదురు అయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నం లో ఉన్నారా ఆన్న అనుమానాలు వస్తున్నాయి.

మే చివరి వారం వరకు ఎన్నికల కోడ్ ఉంటుంది. బడ్జెట్ పూర్తి స్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పట్టే అవకాశం ఉన్నదని ప్రజల్లో ఉంది. పూర్తి స్థాయిలో బడ్జెట్ పెడితే ఈ స్కీమ్ కు ఎంత నిధులు పెడతారు అని తేలే ఛాన్స్ ఉంటుంది. ఆరు గ్యారెంటీ లు అమలు చేయాలనీ కాంగ్రెస్ సర్కార్ కు ఉంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టాలి. మేము ఈసీకి ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వం. పథకాలు అమలు కావాలని కోరుకుంటున్నాం. స్కీమ్ లకు గైడ్ లైన్స్ లేకుండా అప్లికేషన్ లు తీసుకోవడం రాష్ట్ర చరిత్రలో మొదటి సారి అని పేర్కొన్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news