దటీజ్ సీఎం జగన్… వైసీపీ పాలనపై తెలంగాణ ప్రజల పొగడ్తలు

-

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపిస్తోంది.. ఆరు గ్యారెంటీ ల పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో అందరూ మీసేవ సెంటర్ల వద్దకు క్యూ కడుతున్నారు.. దీంతో ఎటు చూసినా కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్ లు దర్శనమిస్తోంది.. తెలంగాణ ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభంలోనే ప్రజలను ఇబ్బంది పెట్టడంపై గ్రామీణ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు మీసేవ సెంటర్లకి వెళ్లాల్సి రావడంతో.. పనులు వదులుకొని మరి సెంటర్ల వద్దకి పరుగులు పెడుతున్నారు.. ఇదే క్రమంలో పక్క రాష్ట్రంగా ఉన్న ఏపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు..

 

తెలంగాణకి ఏపీకి తేడా ఏంటి..?

మీసేవ సెంటర్ల వద్ద గంటల కొద్ది పడిగాపులు పడుతున్న జనాలను సోషల్ మీడియాలో, టీవీలలో చూస్తున్న ఏపీ ప్రజలకు.. తమ రాష్ట్రమే మేలంటూ కితాభిస్తున్నారు.. అడుగు ఇంటి నుంచి బయటకు పెట్టకుండానే సంక్షేమ పథకాలన్నీ తమ గుమ్మానికి చేరుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పటిష్టంగా ఉండడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం.. అర్హులైన లబ్ధిదారులు ఇంటికే వస్తుందని.. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి అందజేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.. 6 గ్యారెంటీలంటూ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి అది తలనొప్పిగా మారింది.. రేషన్ కార్డు తప్పనిసరి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అందరూ రేషన్ కార్డులు చేయించుకునేందుకు.. కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ సెంటర్ వైపు పరుగులు పెడుతున్నారు.. తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ భేష్..

తెలంగాణ రాష్ట్రంలో లాగా రేషన్ కార్డులకు ఆధార్ కార్డులకు మీసేవ సెంటర్ వైపు పరుగులు పెట్టకుండా ఏపీలో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు.. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అవసరమైన అన్ని పనులు సచివాలయం వ్యవస్థ ద్వారానే అధికారులు చేస్తున్నారు.. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రాలు, సర్టిఫికెట్ల తొ పాటు సంక్షేమ పథకాలకు అవసరమైన అన్ని పత్రాలను సచివాలయంలోనే ఇచ్చేలా సీఎం జగన్ నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.. దీంతో వాలంటీర్లు ఇంటికి వచ్చే సంక్షేమ పథకాల అందిస్తున్నారు.. తెలంగాణలో మీసేవ సెంటర్ల వద్ద ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. ఏపీలో జగన్ పాలన బాగుందని.. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలు తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news