నేడు పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం

-

ప్రపంచమంతా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించే పనిలో బిజీగా ఉంది. కానీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాత్రం ఈ ఏడాదికి ఓ కొత్త ప్రయోగంతో ఆహ్వానం పలకడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 31వ తేదీన ఈ కొత్త ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ చేసింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి నేడు పీఎస్‌ఎల్‌వీ-సీ58ని నింగిలోకి పంపేందుకు ఇస్రో సంసిద్ధమైంది.

ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభం కాగా 25 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్‌ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంటుందని చెప్పారు. అనంతరం రాకెట్‌లో నాలుగో స్టేజ్‌ అయిన పీఎస్‌4 అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news