CM Revanth Reddy : CM రేవంత్ తొలి విదేశీ పర్యటన ఖరారు

-

CM Revanth Reddy :  సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14న దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం అయిన తర్వాత ఆయన చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. దావోస్ లో జరిగే ప్రపంచదేశాల పారిశ్రామికవేత్తల సమావేశానికి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది.

CM Revanth’s first foreign visit finalized

ఈ మేరకు భారీ పెట్టుబడును ఆకర్షించడానికి అక్కడికి వెళ్ళనున్నారు. ఈనెల 24 తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు ఈ పర్యటనకు వెళ్తారని సమాచారం.

కాగా, ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈనెల 17వ తేదీలోపు పూర్తి చేయాలని తెలంగాణ సిఎస్ శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంపై కలెక్టర్లతో సిఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇకనుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజా పాలనకార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news