తెలంగాణలో అదానీ గ్రూప్స్ భారీ పెట్టుబడులు

-

తెలంగాణలో పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ మరోమారు ముందుకు వచ్చింది. ఈరోజు డా. బి. ఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డితో పోర్ట్స్ – సెజ్ సిఇఓ శ్రీ గౌతమ్ అదాని పెద్ద కుమారుడు శ్రీ కరణ్ అదానీ, అదాని ఎరో స్పేస్ సిఇఓ శ్రీ ఆశీష్ రాజ్ వన్షి లతో చర్చలు జరిపారు.

Adani Group’s huge investments in Telangana

పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వనిస్తున్నామని అన్నారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు అన్నారు.

ప్రభుత్వం మారినప్పటికీ తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందు నిలబడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news