ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

-

తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేయడంతో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అయిన విషయం తెలిసిందే.

జనవరి 11న ఈ రెండు ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఇక నామినేషన్ల స్వీకరణకు ఈనెల 18వ తేదీ చివరి తేదీగా పేర్కొన్నారు. జనవరి 19 న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22 న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా నిర్ణయించారు. ఈనెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు ఎన్నిక అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వాస్తవానికి వారిద్దరి పదవీకాలం 2027 నవంబరు 30 వరకూ ఉంది. కానీ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. కొత్తగా ఎమ్మెల్సీలు ఎన్నికైనా వారు అప్పటి వరకే  కొనసాగనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news