తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ వన్ 420 కేసీఆర్ అని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ మోసగాడు అని అందరూ మోసగాళ్లు అనుకుంటే ఏట్లా కేటీఆర్ అని జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నెల రోజుల్లోనే హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మొదటగా దళితులని మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
దళితులకు మూడు ఎకరాల భూమి అని మరోసారి మోసం చేశారని.. మీరు ఇచ్చిన హామీలను ఒకసారి నెమరు వేసుకోండి కేటీఆర్ అని జీవన్ రెడ్డి చురకలు అంటించారు. 9 సంవత్సరాల్లో నగరంలో తప్ప ఎక్కడైనా ఇళ్లు కట్టారా..? అని ఆయన ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళకు ఉచిత బస్ ప్రయాణం కలిపించామని ఆయన వెల్లడించారు. మేము ఇచ్చిన హమీలను నెరవేర్చడానికి మూడు వారాలనే దరఖాస్తులు తీసుకుంటున్నామని గిరిజనులను దళితులను మోసం చేసింది బీఆర్ఎస్ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.