ఓటీటీలోకి కోటబొమ్మాళి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

-

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటించిన సినిమా ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం నవంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టడమే కాకుండా మంచి టాక్ను సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు శరత్ కుమార్, పవర్ ఫుల్ లేడీ వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ ఇతరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తేజ మార్ని తెరకెక్కించారు. ఈ మూవీని బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు.

థియేటర్లలో విడుదలై అటు ప్రేక్షకులు ఇటు విమర్శకుల మెప్పు పొందిన ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు రెడీ అయింది. జనవరి 11వ తేదీ నుంచి ‘కోట బొమ్మాళి పి.ఎస్‌.’ను ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ‘ఆహా’ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ చిత్రంలోని ‘లింగిడి.. లింగిడి’ సాంగ్‌ మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ప్రతి ఫంక్షన్లో అదే పాట వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news