ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళ, బుధవారాల్లో లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అక్కడి దీవుల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించారు. సముద్రం ఒడ్డున కూర్చుని సేద తీరిన తర్వాత మోదీ సముద్రంలో స్నార్కెలింగ్ (సాహసంతో కూడిన స్విమ్మింగ్) చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు.
లక్షద్వీప్ సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి తానింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నానని మోదీ ట్వీట్ చేశారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయని పేర్కొన్నారు. 140కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం నేను మరింత కష్టపడి ఎలా పని చేయాలో ఈ వాతావరణం తనకు నేర్పిందని వెల్లడించారు. “సాహసాలు చేయాలనుకునేవారు.. మీ జాబితాలో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోండి’’ అని మోదీ ట్వీటారు. లక్షద్వీప్‌లో తాను స్నార్కెలింగ్ కూడా ప్రయత్నించినట్లు తెలుపుతూ ఆ చిత్రాలను కూడా షేర్ చేసిన మోదీ ‘ఇది ఎంతో అద్భుతమైన అనుభవం’ అని పేర్కొన్నారు.
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
During my stay, I also tried snorkelling – what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7
— Narendra Modi (@narendramodi) January 4, 2024