రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. అజెండా అదేనా..?

-

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా నేటికి నెల రోజులు పూర్తి అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీ స్కీమ్ లతో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.

ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఆరోగ్య శ్రీ కింద రూ.10లక్షల వరకు పెంపు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ కేబినేట్ భేటీ ముహుర్తం ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి రేపు సమావేశం కానుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కావడం.. ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీల అమలుపై ఈ భేటీలో ప్రధాన అజెండాగా చర్చించుకున్నారని సమాచారం. వీటితో పాటు మరి కొన్ని అంశాలు ఈ మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news