సీఎం రేవంత్ రెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. అందుకోసమేనా ?

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేకంగా కలిసారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం సుమారు 20 నిమిషాల పాటు ఇరువురు నేతలు రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అతి త్వరలోనే నామినేటేడ్ పదవులు ప్రకటించే నేపథ్యంలో జగ్గారెడ్డి సీఎంను కలవడం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు తీసుకున్న తరువాత జగ్గారెడ్డి ఫస్ట్ టైమ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో మంగళవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీ జగ్గారెడ్డి భేటీ కావడం ఆసక్తి రేపింది. ఎన్నికల ముందు వరకూ వీరిద్దరూ రాజకీయంగా బద్ధ విరోధులుగా ఉండేవారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటం, రేవంత్‌ ఏకంగా ముఖ్యమంత్రి అవడంతో వైరుధ్యాలు కాస్త పక్కన పెట్టినట్టు ఉన్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన జగ్గారెడ్డి.. ఆయనతో దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలపై వారిద్దరూ చర్చించారు. అలాగే సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి, నిధుల మంజూరు వంటి అంశాలపై రేవంత్‌రెడ్డితో జగ్గారెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news