సాధారణంగా బ్యాంకులోకి కస్టమర్లు ఎక్కువ అయితేనే అధికారులు అయోమయానికి గురై.. ఏదో ఒక సాకు చెప్పి తొందరగా పంపించాలని చూస్తుంటారు. ఇక ఎస్బీఐ బ్యాంకు అధికారులు అయితే కాస్త ఎక్కువ అనే చెప్పాలి. ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ ఎస్బీఐ బ్యాంకులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బ్యాంకులోకి ఓ ఎద్దు ప్రవేశించింది.. ఆ ఎద్దును చూసిన కస్టమర్లు, బ్యాంకు అధికారులు ఉన్నట్టుండి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఉన్నావ్ నగరంలోని ఎస్బీఐ బ్రాంచ్‌లోకి ప్రవేశించిన ఎద్దు.. కాసేపు అలానే నిల్చుని గమనించింది. ఎద్దును చూసిన కస్టమర్లు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అది ఎక్కడ దాడి చేస్తుందోనన్న భయంతో దూరంగా వెళ్లారు. అంతలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ ఎద్దును బయటకు తరిమేశారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించిన ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
उन्नाव के एसबीआई बैंक में अचानक घुसा सांड, लोग बोलें काउन्टर तीन पर जाओ!
बैंककर्मी बोलें लंच टाइम 😂😂@TheOfficialSBI #SBI #Unnav #UttarPradesh #viral pic.twitter.com/hoxUdTWHRK— Aditya (@rjadi28) January 10, 2024