తాజాగా గోనె ప్రకాశ్ రావు, మాజీ ఎమ్మెల్యే పలు కామెంట్స్ చేసారు. గతంలో మాజీ ఎమ్మెల్యేలకు సెక్రటేరియట్, అసెంబ్లీలో నిర్బంధం ఉండేదని… కానీ, ఇప్పుడు అలా లేదు అని అన్నారు. అలానే ఈ విషయం పై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా అని అన్నారు. అలానే సెక్రటేరియట్ కట్టడం బాగుందని, కేసీఆర్ అద్భుతంగా కట్టారు అని గోనె ప్రకాశ్ రావు అన్నారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ని కలిసి వినతిపత్రం ని ఇచ్చినట్టు గోనె ప్రకాశ్ రావు అన్నారు. మంచిర్యాల నుంచి అంతర్గామ్ వయా హైదరాబాద్ మార్గంలో బ్రిడ్జి నిర్మించాలన్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇది వరకు పాలకులు ఎవరు బ్రిడ్జి విషయాన్ని పట్టించుకోలేదన్నారు. 2023లో టెండర్ అయ్యింది అని, పనులు పూర్తి కాలేదు అని ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలి అని చెప్పారు.