దేశంలో, రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే.. సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పోచారం మాట్లాడుతూ.. ఆహారధాన్యాల కొరత నివారణకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని అన్నారు. ఏటా వృథాగా పోతున్న వందల టీఎంసీల నీటి సద్వినియోగానికి.. గోదావరికి అడ్డంగా ప్రాజెక్టులు కట్టామని గుర్తు చేశారు.
దీంతో 30 లక్షల టన్నులుగా ఉన్న వరి ధాన్యం ఉత్పత్తి 2 కోట్ల టన్నులకు పెరిగిందని తెలిపారు. అన్ని వనరులు సద్వినియోగం చేసుకుని పంట దిగుబడి పెంచామని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయాలంటే.. సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పోచారం మాట్లాడుతూ.. ఆహారధాన్యాల కొరత నివారణకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిందని అన్నారు.