చంఢీఘర్ మేయర్ స్థానాన్ని ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చదదా జోష్యం చెప్పారు. ఏప్రిల్ / మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు చంఢీఘర్ మేయర్ విజయం.. ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుందని తెలిపారు. జనవరి 18వ తేదీ జరిగే చంఢీఘర్ మేయర్ ఎన్నికలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఇండియా కూటమీ చారిత్ర, నిర్ణయాత్మక గెలుపు సొంతం చేసుకుంటుంది. తొలిసారిగా ఇండియా కూటమి, బీజేపీ మధ్య పోరు జరుగనుంది. మేయర్ ఫలితాలు విడుదలయ్యాక ఇండియా కూటమి 1 బీజేపీ 0గా మారబోతుంది. ఈ గెలుపుతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుంది అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. ఇండియా కూటమి చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో పోరాడి గెలుపొందుతుందని తెలిపారు. ఈ ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా భావించమని తెలిపారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు తాము ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తామని తెలిపారు.