ప్రజాకోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదు : మంత్రి అమర్నాథ్

-

పలు కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతున్న దొంగ చంద్రబాబు అని ఘాటు విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా.. స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పులపై అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదన్నారు.

మంత్రి అమర్నాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా చంద్రబాబుకు ఊరట లభించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. సుప్రీంకోర్టులో చంద్రబాబు ఎలాంటి ఊరట లభించలేదు. 17ఏ అమలులోకి రాకముందు ఉన్న కేసు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు.. ఈ కేసులో వాళ్లు ఎక్కడ తప్పు చేయలేదని చంద్రబాబు మాట్లాడటం లేదు. తాను అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు చెప్పడం లేదు. స్కిల్ స్కామ్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదు. 2015లో ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు దొరికినప్పుడు సెక్షన్ 8 అమలులో ఉందని.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. పలు కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతున్న దొంగ చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news