ఆరిజన్ లైఫ్ సైన్స్ తో రూ.2000 కోట్లకి ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం

-

దావోస్ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. ఆరిజన్ లైఫ్ సైన్స్ తో 2000 కోట్లకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఒప్పందంతో 1500 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచానికి మెడిసిన్ హబ్ గా ఉన్న హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. మల్లాపూర్ లో ఉన్న కంపెనీలో పెట్టుబడులు, డ్రగ్స్ డిస్కవరీ డెవలప్ మెంట్ మ్యాన్ ఫాక్షరింగ్ రంగాల్లో పెట్టుబడులు, భారీ పెట్టుబడులు కొత్త పాలసీలకు నిదర్శనం అన్నారు. 

ఆ సంస్థ సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్టు వెల్లడించారు. తెలంగాణలో రూ.12,400 కోట్లు భారీ పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూపు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బహుళ ప్రయోజనాలతో ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లోని జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ లో అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు చర్చించి నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసారు. తెలంగాణలో 1350 మెగా వాట్ల సామర్థ్యంతో రెండు పంపు స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.5వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news