ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వనదేవతలను మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ దేవతలకు పసుపు, కుంకుమ, బెల్లం, చీరె, సారే నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ…జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అని తెలిపారు.
జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో పూజారుల కోసం నూతనంగా ప్రత్యేక అతిథి గృహాన్ని 1.5 కోట్లు రూపాయలతో నిర్మిస్తున్నామని అన్నారు. వచ్చే జాతర సమయానికి ఈ అతిథి గృహం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.నిర్మాణ పనుల్లో రాజీ పడొద్దని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దనుసరీ సీతక్క హాజరు అయ్యారు.అయితే,కాగా ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఇంకా నెల రోజులు సమయం ఉన్న అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. భక్తులు ముందుగా స్థానిక జంపన్న వాగులో స్నానము చేసి, తలనీలాలు సమర్పించుకుని సమ్మక్క-సారలమ్మ లకు మొక్కులు చెల్లిస్తున్నారు.