Devara : ‘దేవర’ ఓటీటీ హక్కుల కోసం రూ.155 కోట్లు!

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవర’. అలనాటి నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Devara Pre-Box Office Business

అయితే, ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల హక్కులకు నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ. 155 కోట్లు వెచ్చించిందని టీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుండగా…. రెండు వారాలకు ఓటీటీలో రానుందని ప్రచారం జరుగుతోంది.  కాగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవి చందర్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news