బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నా : నయనతార

-

లేడీ సూపర్స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూరణి’ ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. సినిమా ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించారు. అయితే తాజాగా ఈ వివాదంపై నయనతార స్పందించింది.

‘బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నా అంటూ ఓ ప్రకటన చేసింది. ‘అన్నపూరణి’ సినిమాను ప్రజల్లోకి మంచి ఆలోచన తీసుకెళ్లేందుకు రూపొందించామని తెలిపింది. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలియజేసేందుకు తెరకెక్కించామని.. ఈ ప్రయత్నంలో తమకు తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచామని ప్రకటనలో పేర్కొంది. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చిన సినిమాను ఓటీటీ వేదిక నుంచి తొలగిస్తారని ఊహించలేదని.. తమ టీమ్, తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదని చెప్పారు. మీ మనోభావాలను గాయపరిచినందుకు క్షమించండి. ఈ చిత్ర ప్రధాన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదు. నా 20 ఏళ్ల కెరీర్‌లో సానుకూలతను వ్యాప్తిచేయాలనే చూశాను’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news