పాలనపై ప్రభుత్వం ఫోకస్ చేయడం లేదు అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్ల విషయం పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం అన్నారు. తమకు ఉన్న సమాచారం ప్రకారం.. కృష్ణా బోర్డు ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయని తెలిపారు.
ఉమ్మడి ప్రాజెక్టులు కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తాయని తెలుస్తోందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ తకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్, కేంద్ర జలవనరుల శాఖ ఒత్తిడి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అయితే ఆయా అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలని హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణకు రావాలని.. కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పితే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందన్నారు. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.