తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఎంత టైం పడుతోందంటే..?

-

చాలామంది సెలవులు కారణంగా తిరుమల వెళ్తున్నారు అయితే తిరుమల వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించడం మంచిది. కలియుగం దైవం వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇవాళ భక్తులు తాకిడి బాగా పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగుస్తున్న నేపథ్యం లో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు క్యూ కట్టారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు భక్తుల తో నిండిపోయాయి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు తిరుమల కి వెళ్తున్నారు. నిన్న స్వామి వారిని ఏకంగా 62,649 మంది దర్శించుకున్నారు.

time for Tirumala Srivari Sarva Darshan

అందులో 24384 మంది భక్తులు తల్లినీలాలని ఇచ్చి స్వామి వారి మొక్కును తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న 3.74 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పడం జరిగింది. ఇక ఇవాళ విషయానికి వస్తే ఇవాళ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లో అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి సర్వదర్శనం కోసం సుమారు 19 గంటల సమయం పడుతుంది

Read more RELATED
Recommended to you

Latest news