CM Revanth Reddy: రేవంత్‌ కు ఫ్లయింగ్‌ కిస్‌

-

గత వారం రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసేందుకు తెలుగు ప్రజలు, అభిమానులు ఎగబడుతున్నారు. కాగా, ఓ కార్యక్రమంలో స్టేజ్ పై సీఎం మాట్లాడుతుండగా ఓ యువతి ఆయనకు ఫ్లవర్ బొకే ఇచ్చింది.

Flying kiss to Revanth during his visit to London

సీఎం షేక్ హ్యాండ్ ఇవ్వగా మురిసిపోయింది. ఆపై రేవంత్ కు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఖండాలు దాటిన రేవంత్ అభిమానులు ఉంటారంటూ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా, దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్ లలో మాట్లాడారు. చిన్న మరియు సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలను కోరారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలనీ అన్నారు. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు యూరప్,అమెరికా దేశాలు పని చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news