అయోధ్య కి ఆఫ్గానిస్తాన్ నుండి ప్రత్యేక కానుక..!

-

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లుని కూడా చేసేసారు. ఆలయంలో కొలువుదీరే బాల రాముడికి ఆఫ్ఘనిస్తాన్ తో సహా ప్రపంచ నలుమూలల నుండి కూడా కానుకలు భారీగా వస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తాజాగా కాశ్మీర్ తమిళనాడు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన కానుకలని రామాలయ ట్రస్ట్ సభ్యులకి ఇచ్చారు. ఈ రామాలయ నిర్మాణం పై ముస్లిం సమాజం కూడా సంతోషంగా ఉందని అలోక్ చెప్పారు కాశ్మీర్ కి చెందిన ముస్లిం సోదరులు సోదరీమణులు తనని కలవడానికి వచ్చారని, మందిర నిర్మాణం పై సంతోషాన్ని వ్యక్త పరచాలని అన్నారు.

ఇక ఆఫ్గనిస్తాన్ నుండి వచ్చిన ప్రత్యేక కానుక గురించి చూస్తే ఆఫ్ఘనిస్తాన్ లోని కాబోల్లో కుబా నదిలోని నీటిని కానుకగా స్వీకరించామని ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్రత్యేక కానుక ఇలా వచ్చిందని అన్నారు. తమిళనాడుకు చెందిన పట్టు వస్త్రాలు తయారీదారులు శ్రీరాముని చిత్రంతో నేసిన సిల్క్ దుస్తులను అయోధ్య రామ మందిరానికి పంపించినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news