తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అక్కడ పాఠశాలలను నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజుల క్రితం కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు.
సైనిక్ స్కూల్ మంజూరు చేయడంతో పాటు పాఠశాలలకు అవసరమైన 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని, అందుకు బదులుగా వేరే చోట రక్షణ శాఖకు స్థలం ఇస్తామని మంత్రి వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. కేంద్రం కూడా సుముఖంగా ఉండటంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విద్యాశాఖ అధికారులతో చర్చించారు. పూర్తిస్థాయి గురుకులం తరహాలోనే పాఠశాలలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు కేంద్రానికి సమర్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.