నల్లగొండలో జానారెడ్డి కొడుకు, పటేల్ రమేష్ రెడ్డి మధ్య గొడవలు ?

-

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 64 సీట్లతో బయటపడ్డ కాంగ్రెస్ పార్టీ… మొదటినుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైందన్న సంగతి తెలిసిందే. అలాగే పార్టీలో కొందరు నేతల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. తాజాగా నల్గొండ జిల్లాలో ఈ అంశం తెరపైకి వచ్చింది.

Jana Reddy's son vs Patel Ramesh Reddy in Nalgonda
Jana Reddy’s son vs Patel Ramesh Reddy in Nalgonda

నల్లగొండలో జానారెడ్డి కొడుకు vs పటేల్ రమేష్ రెడ్డి గా వివాదం కొనసాగుతోంది. నల్లగొండ ఎంపీ సీటు తన కొడుకు రఘువీర్ రెడ్డికి దక్కేలాసీనియర్ నాయకుడు జానారెడ్డి పావులు కదుపుతున్నారు. అయితే రేవంత్ అనుచరులు అవడం వల్లే నన్ను, అద్దంకి దయాకర్‌ను తొక్కుతున్నారని పటేల్ రమేష్ రెడ్డి చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో రేవంత్ ముద్ర లేకుండా ఉండటానికి జిల్లా సీనియర్లు మాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు… నల్లగొండ ఎంపీ టికెట్ పక్కా నాదే అంటున్నారు పటేల్ రమేష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news