తెలంగాణలో నౌకాదళ రాడార్‌ స్టేషన్‌.. దామగుండం అడవిలో ఏర్పాటు

-

నౌకలు, జలాంతర్గాములతో సమన్వయంచేసే వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత నౌకాదళం రాడార్ కేంద్రం ఏర్పాటుకు మరో కీలక అడుగు ముందుకు పడింది. వికారాబాద్ జిల్లా దామగూడంలో 1174 హెక్టార్ల అటవీ భూములను నావికా దళానికి రేవంత్ సర్కార్ బదిలీ చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో తూర్పు నావిక దళం, అటవీ, ఇతర శాఖల అధికారులు ఒప్పందాలపై బుధవారం రోజున సంతకాలు చేశారు.

ఇప్పటికే తమిళనాడు తిరునెల్వేలిలో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ కేంద్రం 1990 నుంచి సేవలు అందిస్తుండగా రెండో స్టేషన్ దామగూడం అటవీప్రాంతంలో ఏర్పాటు చేయాలని 2010లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2014లో కేంద్ర అటవీపర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలను ఆమోదించిగా.. అటవీ భూములను అప్పగించేందుకు సుమారు 155 కోట్లను నౌకాదళం చెల్లించింది. కోర్టు వివాదాలు, ఇతర కారణాలతో భూకేటాయింపు ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇక తాజాగా భూ బదిలీపై ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నేవీ స్టేషన్‌తో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, బ్యాంకులు, మార్కెట్లతో కూడిన టౌన్‌షిప్ నిర్మించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news