నా 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఇలాంటివి ఎన్నో చూసా… మహారాష్ట్రలో బిజెపిని అధికారం చేపట్టనివ్వను, 162 మంది ఎమ్మెల్యేలను నేనే సభకు స్వయంగా తీసుకొస్తాను… వాళ్లకు నాయకత్వం వహిస్తాను…ఇది గోవా కాదు, కర్ణాటక అంతకంటే కాదు, హర్యనాలా జరిగే అవకాశమే లేదు… ఈశాన్య రాష్ట్రం అంతకంటే కాదు… మనం మహారాష్ట్ర ప్రజల కోసమే కలిసాం… కలిసి పని చేస్తాం… మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరతాం… గ్రాండ్ హయత్ హోటల్ లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలను ఉద్దేశించి,
మరాఠా రాజకీయ దిగ్గజం, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలవి… మోడీషాల బలం తెలిసి కూడా ఆయన ఆ సవాల్ ని చేసి ఎమ్మెల్యేలను నేనే సభకు తీసుకొస్తాను అంటూ చేసిన సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు దేశం మొత్తం హాట్ టాపిక్… అసలు శరద్ పవార్ ఎవరూ అనే దాని మీద దేశం మొత్తం ఇప్పుడు వెతుకులాట మొదలుపెట్టింది… ఆయన గురించి ఎప్పుడో గాని బయటకు రాదూ… కేంద్రంలో ఎన్నికలప్పుడు విపక్షాల కూటమిలోనో ఎక్కడో ఆయన సందడి చేయడం మినహా ఆయన హడావుడి చాలా తక్కువ…
కాని రాజకీయాలు తెలిసిన వాళ్లకు మాత్రం శరద్ పవార్ దిట్ట… ముఖ్యంగా ఆయన పవర్ కోసం చేసే పాలిటిక్స్ క్రికెట్ లో కూడా అన్ని ట్విస్ట్ లు ఉండవు… ఎటు నుంచి ఎటు దెబ్బ కొడతారో తగిలే వరకు ఎవరికి అర్ధం కాదు… బుధవారం మరాఠా పీఠం ఎవరిది అనేది తెలిసిపోతుంది. అధికార లక్ష్మిని బిజెపి కాపాడుకు౦టుందా… లేక బలపరీక్ష తక్కెడ శరద్ పవార్ వైపు తూగుతుందా అనే రేపు సాయంత్రం తేలిపోతుంది… ఏది ఎలా ఉన్నా సరే… ఇప్పుడు శరద్ పవార్ రాజకీయమే హైలెట్… ఆయన సోషల్ మీడియాతో పాటు గూగుల్ లో కూడా ఆయనే ఇండియాలో టాప్ సెర్చింగ్ రాజకీయ నాయకుడు…
ఎప్పుడో ఆయన 38 ఏళ్ళ వయసులో… కాంగ్రెస్ ని చీల్చి అధికారం చేపట్టి అప్పుడే ఈ పవర్ ఆటలు ఆడారు… ఇప్పుడు మోడీషాలను ఎదుర్కొంటున్నారు… ఆయన్ను దాటుకుని మోడిషా… అధికారాన్ని నిలబెట్టుకుంటారా… లేక విశ్వాస పరీక్షలో గత ఏడాది కర్ణాటక మాదిరి అధికారం పోగొట్టుకుంటారా అనేది చూడాల్సి ఉంది…