మూసీ నదిని అద్భుతంగా తీర్చిదిద్ది చూపిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

-

ప్రతి రాష్ట్రం హైదరాబాద్ వైపు చూస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రష్యా లాంటి దేశాల్లోని పారిశ్రామికవేత్తలు కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారని తెలిపారు. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని వెల్లడించారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తుందా అని అవహేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్ హోటల్ ఐటీసీ కాకతీయలో నిర్వహించిన సీఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందా అని మాట్లాడుకున్నారన్న మంత్రి.. తెలంగాణలో గెలిచి చూపించామని చెప్పారు. అలాగే మూసీ నదిని అద్భుతంగా తీర్చిదిద్ది చూపిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో మూడు దశల్లో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

“రీజినల్ రింగు రోడ్డు కోసం కేంద్రాన్ని నిధులు ఇవ్వమని కోరాం. ఓఆర్‌ఆర్ టూ ఆర్‌ఆర్‌ఆర్‌ టూ క్లస్టర్స్‌గా ప్రణాళికలు చేస్తున్నాం. ఆరు గ్యారంటీలు అమలు చేయడం అసాధ్యమని కొందరు అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. డ్యాం సేఫ్టీ అధికారులు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక ఇచ్చారు. ప్రజాధనం వృథా కాకుడదనేదే మా ప్రభుత్వ లక్ష్యం.” అని శ్రీధర్ బాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news