చంద్రబాబు చేపట్టిన రా కదలిరా కార్యక్రమం కార్యకర్తల్లో జోష్ నింపుతుందో లేదో కానీ.. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు బట్టబయలు చేస్తుంది.. కొన్నిచోట్ల టిడిపి అధినేత చంద్రబాబు టిక్కెట్ను కన్ఫామ్ చేయడంతో ఆశావాహులు రోడ్డెక్కి విమర్శలు చేస్తున్నారు.. టిడిపికి వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపిస్తామని హెచ్చరిస్తున్నారు..
అరకు టిడిపిలో టికెట్ ఫైట్ రోడ్డెక్కింది.. పార్టీని నమ్ముకుని దాన్ని బలోపేతానికి కృషి చేస్తున్న అబ్రహంను కాదని టిడిపి నందు చంద్రబాబు దొన్ను దొరకు టికెట్ కేటాయించారు.. దీంతో అబ్రహం వర్గం అగ్గి మీద గుగ్గిలం అవుతుంది.. పార్టీని నమ్ముకుని కుట్ల రూపాయల ఖర్చుపెట్టిన తమ నేతకు టికెట్ ఇవ్వకుండా.. ధోన్ను దొరకు టిక్కెట్ ఇస్తున్నట్లు బహిరంగ సభలో చంద్రబాబు చెప్పడాన్ని వారు తప్పుపడుతున్నారు..
అరకు టిడిపిలో అబ్రహం బలమైన నేతగా ఉన్నారు.. 2024 లో టికెట్ ఇస్తానని.. పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని చంద్రబాబు హామీ సైతం గతంలో ఇచ్చారట..ఈ క్రమంలో అబ్రహం పార్టీని నమ్ముకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.. చివరి నిమిషంలో దొన్ను దొరకు టికెట్ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం పై అబ్రహం అనుచరులు ఆగ్రహం తో ఊగిపోతున్నారు.. జనసేన తో పొత్తు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీకి టికెట్ కేటాయిస్తారని కొద్ది కాలంగా ప్రచారం జరుగుతుంది.. ఈ నేపథ్యంలోనే అరకు అభ్యర్థిని ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీ అభ్యర్థిగా ఉన్న ధోన్ను దొరకు సహకరించే ప్రసక్తే లేదని అబ్రహం అనుచరులు చెబుతున్నారు. చంద్రబాబు తమని సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసున్నారని.. టీడీపీ లో మెజార్టీ వర్గం గుర్రుగా ఉందట.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు ఈ నియోజకవర్గ టీడీపీ లో ఏమైనా జరగొచ్చు..