IND VS ENG : విశాఖ టెస్టుకు నేటి నుంచి టికెట్ల విక్రయం

-

క్రికెట్ అభిమానులకు అలర్ట్. విశాఖ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టుకు నేటి నుంచి టికెట్లను విక్రయించనున్నారు. ఫిబ్రవరి 1 వరకు రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు స్టేడియం కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంటాయి.

Tickets on sale for Visakhapatnam Test from today

రోజు వారీగా రూ. 100, రూ. 200, రూ. 300, రూ.500 టికెట్లు తీసుకోవచ్చు. ఐదు రోజులకు కలిపి తీసుకుంటే ధరలు రూ. 400, రూ. 800, రూ. 1,000, రూ. 1,500గా ఉంటాయి. ఐదు రోజుల్లో 10వేల మంది విద్యార్థులు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తారు.

కాగా భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ల తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోయిన భారత్ 119 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైస్వాల్ (76), శుభమన్ గిల్ (14) పరుగులతో ఉన్నారు. భారత్ తొలి వికెట్ రోహిత్ శర్మ(24) పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 64.3 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news