బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై శుక్రవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రొఫెసర్ టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం పెద్దన్నల ముందుండి నడిపిస్తే కేసీఆర్ క్రెడిట్ ని కొట్టేశారని ఆరోపించారు. ఉద్యమంలో కోదండరాం డైరెక్షన్ లోనే అందరూ పని చేశారనీ.. కీలక సమయంలో ఆయన భీష్ముడు పాత్ర పోషించారని పేర్కొన్నారు.
ఉద్యమ సమయంలో అందరికీ ఆయన దేవుడులా కనిపించాడని.. కేసిఆర్, హరీష్ రావు ఆయన ఇంటికి ఎన్నోసార్లు వెళ్లారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కేసీఆర్ సీఎంగా కోదండరాం ని ఒక్కసారి కూడా కలవకుండా అవమానించాడని తెలిపారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోదండరాం తెలంగాణకు ఏర్పాటు చేసిన కృషికి ఎమ్మెల్సీ పదవిగా ఇచ్చి గౌరవించామని తెలిపారు జగ్గారెడ్డి. కోదండరాంకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.