మరికొన్ని నెలలు ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటినుండి ఎన్నికలకు సంబంధించిన ప్రారంభించాయి.అధికార పార్టీ వైసీపీ మరింత దూకుడుగా వెళ్తూ….వైనాట్ 175 అంటూ ప్రచారానికి సిద్ధం అవుతోంది.. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసిన వైసీపీ.. ఇక ఇప్పుడు వరుసగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది. ఈ నెల 30వ తేదీన వైసీపీ ఏలూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చూస్తుంది.
అయితే, ఈ నెల 30వ తేదీన జరగవలసిన వైసీపీ సిద్ధం సభ ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడినట్టు వెల్లడించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. 1వ తేదీన ఏలూరులో సిద్ధం సభ ద్వారా ప్రజలకు ఐదేళ్లలో ఏం చేశామో చెప్పడం సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యంగా పేర్కొన్నారు.. రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనేది ఈ సభ నుంచి దిశా నిర్దేశం చేయబోతున్నారని పేర్కొన్నారు.. కాగా, ఏలూరులో నిర్వహించనున్న బహిరంగ సభకు పశ్చిమగోదావరి,తూర్పు గోదావరి, కృష్ణా ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాది మందిని తరలించేలా వైసీపీ ప్రభుత్వము ప్లాన్ చేస్తోంది.