రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి

-

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యం అని అర్ అండ్ బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో సాయి కృష్ణ షాపింగ్ మాల్ ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలో దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి పౌరుడు బాధ్యతతో దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులకు జోహార్లు అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే ఐదు ఏళ్లలో దేశంలోని అన్ని రంగాల్లో మోడల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాల్లో 14 గెలుచుకుంటామని చెప్పారు. గాంధీని రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిగా చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. నల్గొండ పట్టణం వ్యాపారంపరంగా బాగా అభివృద్ధి చెందుతుంది అన్నారు. రేపు 20 కోట్ల రూపాయలతో కలెక్టరేట్ ఎదురుగా స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ నిర్మిస్తున్నట్టు అలాగే డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరచడానికి రూపాయలు 300 కోట్లతో నలగొండ పట్టణాన్ని చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామనే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news