మళ్ళీ తెలంగాణలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గతంలో ఒకరి భూమి ఒకరి పేరున ఎక్కిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను ధరణి వచ్చిన తరువాత కేసీఆర్ ప్రభుత్వంలో రద్దు చేయగా మళ్ళీ ఆ వ్యవస్థను తిరిగి తీసుకురాబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
కాగా, అటు తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ సంచలన ప్రకటన చేశారు. త్వరలో ధరణి పోర్టల్ రద్దు? చేస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటన చేసారు. ధరణి పోర్టల్ రద్దు కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. రైతు బంధు, రైతు బీమా, భూముల అమ్మకం, కొనుగోలు, వారసత్వ ఆస్తుల బదలాయింపు తదితర అన్నిటి మీదా ధరణి రద్దు ప్రభావం ఉంటుంది. ధరణి పోర్టల్ రద్దు ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో రైతన్నలు ఉన్నారు