జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి

-

జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపు తిరిగింది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరిన హిందువులకు సానుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. హిందువులు పూజలు చేసేందుకు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మసీదులో హిందూ దేవతల విగ్రహాలున్నాయని ఇటీవలే ASI సర్వే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది.

Vyas Ka Tekhana ప్రాంతం వద్ద హిందువులు పూజలు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. హిందువుల తరపున అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ వాదించారు. మసీదు లోపల పూజలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు. మసీదు ఆవరణలో హిందువుల యొక్క విగ్రహాలు ఉండటంతోనే కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఔరంగజేబు కాలంలో హిందూ దేవాలయం మసీదుగా మారిందని చరిత్ర విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news