సీఎం జగన్ అందుకు సహకరించాలి : బోండా ఉమ

-

సీఎం జగన్ అందుకు సహకరించాలి అని  బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. తాజాగా అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో టిడిపి పొలిటికల్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తొలి నుంచి సీఎం జగన్ పై ఏవైతే వాస్తవాలు చెబుతున్నాము. అవి నిజం అని ఆయన సొంత రక్తం పంచుకు పుట్టిన ఆయన సోదరి షర్మిలనే తెలియజేస్తుందని తెలిపారు. ఇందుకు సాక్ష్యం ఈమధ్య కడపలో జరిగిన ప్రెస్ మీట్ లో భారతి రెడ్డితో చెప్పిస్తారా అంటూ షర్మిల జగన్ నిలదీయడమే అని వ్యాఖ్యానించారు.

భారతీ రెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలదీయడంతోనే.. జగన్ అవినీతి మొత్తం బయటికి వచ్చిందని మండిపడ్డారు. తాము జగన్ కి సంబంధించిన వాస్తవాల గురించి మాట్లాడితే రాజకీయంగా కట్టు కథలు అల్లుతున్నారని.. ఇప్పుడు సొంత చెల్లిని చెబుతోంది దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు..? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ అవాస్తవాలు అని తేలిపోయింది గా జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ జగన్ తన అబద్దాలను ఒప్పుకోకపోతే జగన్కు లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. లైట్ డిటెక్టర్ టెస్టుకు నువ్వు కూడా సహకరించాలి జగన్ అంటూ వ్యాఖ్యానించారు. జగన్ పై 12 కేసులు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో తాను 18 నెలలు జైల్లో ఉన్నారని బెయిల్ పై బయటకు వచ్చే అవకాశం కూడా లేనిపక్షంలో జగన్ భార్య భారతి రెడ్డి బావమరిది అనిల్ సోనియా గాంధీని కలిసి ఆమె కాళ్ళపై పడితే జగన్ వచ్చిందని షర్మిల చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news