నంది అవార్డుల పేరును గద్దర్‌ అవార్డుగా మారుస్తాము – రేవంత్ రెడ్డి

-

TS: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గద్దరన్న పేరు మీద సినీ కళాకారులకు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.గద్దర్‌ జయంతి రోజు అవార్డులు ప్రదానం చేస్తామని  అన్నారు.కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని  అన్నారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్  రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం  నుంచి గద్దరన్న ప్రతీ జయంతి రోజున ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని తెలిపారు.

నంది అవార్డులను పునరుద్ధరించాలని పలువురు సినీ ప్రముఖులు కోరినట్లు సీఎం  రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాటలతో  ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే.   గద్దర్‌   విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కారు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news