వైసీపీ 5వ లిస్ట్ ఇదే..

-

వైనాట్ 175 లక్ష్యంతో ఇంచార్జ్ లను మారుస్తూన్న వైసీపీ అధిష్టానం మరో 7 స్థానాలకు కొత్త ఇంచార్జ్ లను ప్రకటించింది.నాలుగు పార్లమెంట్ మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఐదో లిస్ట్ తయారీకి వైసీపీ ఎక్కువ సమయం తీసుకుంది.అయినప్పటికీ కేవలం 7 మందిని మాత్రమే ప్రకటించింది.తాజాగా ఈ జాబితాను మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.., ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఈ లిస్టును మీడియా పాయింట్ లో విడుదల చేశారు. మరో 25 వరకు ఇంచార్జ్ లను 5వ జాబితాలో ప్రకటిస్తారని అందరూ ఉహించగా వైసీపీ అధిష్టానమ్ కేవలం ఏడు మందితో కూడిన ప్రకటించింది. మరో జాబితా కూడా ఉండబోతోందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తి ని 4వ లిస్టులో సత్యవేడు అసెంబ్లీ నియోజక వర్గానికి ఇంచార్జ్ ని చేశారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంను తిరుపతి పార్లమెంట్ ఇంచార్జ్ గా ప్రకటించారు.అయితే పార్లమెంట్ కి వెళ్లడం ఏమాత్రం ఇష్టంలేదని చెప్పిన ఆదిమూలం.., మంత్రి పెద్దిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ అధిష్టానం ఆదిమూలం ను పక్కన పెట్టేసింది. తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తి ని పార్లమెంట్ ఇంచార్జ్ గా కొనసాగించింది. సత్యవేడుకి నూకతోటి రాజేష్ ని ఇంచార్జ్ గా ప్రకటించింది. దీంతో ఈ వివాదానికి తెరదించేసింది వైసీపీ అధిష్టానం .

ఇక నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని నరసరావుపేట పార్లమెంట్ కి తరలించారు.నెల్లూరు నగర అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ గా రేగం మత్స్యలింగం,కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమసేట్టి సునీల్,మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా డా!! సింహాద్రి చంద్రశేఖర్ రావు లను ఖరారు చేశారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5వ జాబితా వచ్చేయడంతో మరో లిస్ట్ పై వైసీపీ ఆశావహులు ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news