ఎంపీ టికెట్ కోసం మల్లు రవి కొడుకు దరఖాస్తు

-

కాంగ్రెస్ పార్టీ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఎంపీ టికెట్ కోసం మల్లు రవి కొడుకు దరఖాస్తు చేసుకున్నాడు. నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడు మల్లు రవి కొడుకు మల్లు సిద్ధార్థ్. యువతకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరిన మల్లు సిద్ధార్థ్….తనకు ఛాన్స్ ఇవ్వాలని పేర్కొన్నారు.

Mallu Ravi’s son application for MP ticket

అటు మల్లు రవి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉంటూనే ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు మల్లు రవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతూనే ఎంపీగా పోటీ చేస్తా.. ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్నారు కాబట్టి నేను ప్రత్యేక ప్రతినిధిగా ఉంటూనే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు మల్లు రవి. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news