శుబ్ మాన్ గిల్‌కు వార్నింగ్ ఇచ్చిన రవిశాస్త్రి

-

ఐదు టెస్టులలో భాగంగా ఈరోజు  విశాఖపట్నం వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ తో తలపడుతుంది.అయితే ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మరోసారి   స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో అదే టెస్ట్  మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి  కీలక వ్యాఖ్యలు చేశారు.వరుసగా గిల్  ఫెయిల్ అవుతుండడంతో ఆటను మెరుగుపర్చుకోవాలని హెచ్చరించాడు. ‘టీమ్ ఇండియా లోని  యువ క్రికెటర్లు తమను తాము నిరూపించుకోవాలి అని అన్నారు.జట్టులోకి తిరిగి రావడానికి పుజారా ఎదురుచూస్తున్నాడు అని  గుర్తు చేశారు.. రంజీ ట్రోఫీలో అతను సత్తాచాటుతున్నాడు.’ అని  రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

కాగా, రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు చేసిన గిల్ 46 బంతులు ఆడి 34 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో 5 బౌండరీలు ఉన్నాయి. మొదట్లో నిదానంగా ఆడిన గిల్ ఆ తర్వాత  అండర్సన్ బౌలింగ్‌లో ఓ ఫోర్, షోయబ్ బషీర్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి దూకుడుగా ఆడాడు. అయితే కాసేపటికే అండర్సన్‌ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Read more RELATED
Recommended to you

Latest news