బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కథానాయకుడిగా,దీపికా పదుకొణె హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘ఫైటర్’. అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. పఠాన్, వార్ సినిమాల ఫేమ్ సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అయ్యింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించలేదు. దీంతో ఈ చిత్ర దర్శకుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘ఫైటర్’కు మిక్స్డ్ టాక్ రావడంపై ఆ మూవీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘దేశంలోని 90% జనాభా విమానాల్లో ప్రయాణించలేదు. ఎయిర్పోర్టు కూడా చూసి ఉండరు. అలాంటి వారికి ఈ మూవీ ఎలా అర్థమవుతుంది. వారికి ఇది వింతగా అనిపించొచ్చు’ అని తెలిపారు. కాగా ఇదెక్కడి లాజిక్ అని సిద్ధార్థ ఆనంద్ పై సోషల్ మీడియా వేదికపై నెటిజన్లు మండిపడుతున్నారు.