ఎన్నికలు దగ్గర పడడంతో ఓ రేంజ్ లో ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు నాయకులు. కేవలం నాయకులే కాదు ప్రజలు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఎన్నికలు దగ్గర పడడంతో ప్రజలకు ఎప్పుడూ కూడా కనపడని కొత్త ముఖాలు కనబడుతూ ఉంటాయి ఎన్నికల ప్రచారంలో లీడర్లు చేసే చిత్ర విచిత్రాలు మామూలుగా ఉండవు అసలు ఎప్పుడు ప్రజల్ని పట్టించుకోని వాళ్ళు కూడా ఓట్లు సమయంలో ప్రజల దగ్గరికి వచ్చి ముఖాలు చూపిస్తారు. అలానే విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఇటువంటివి వెలుగు చూస్తున్నాము.
బాలుడికి స్నానం చేయించిన ఎమ్మెల్సీ
కుప్పం – సామగుట్టపల్లిలో పర్యటించిన టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఓ బాలుడికి స్నానం చేయించారు. pic.twitter.com/BbITDogW8y
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2024
అయితే ఏపీలో ఒకటి జరిగింది ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుందో ప్రధాన పార్టీలు ప్రచారం ఉపందుకున్నాయి. ఈ ప్రచారంలో ఒక ఎమ్మెల్సీ చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పంలో సామగుట్టపల్లిలో పర్యటించారు ఒక మహిళ తన బాలుడికి స్నానం చేస్తూ కనపడింది ఆమెను పక్కకి జరిపి ఎమ్మెల్సీ ఆ బాలుడికి స్నానం చేయించారు దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.